Healthy Food: ఓట్స్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
ఓట్స్ సంవత్సరం అంతా పండుతాయి. పైగా భారీ వర్షాపాతాన్ని కూడా తట్టుకోగలవు. యూరోప్, పశ్చిమాసియాలో ఓట్స్ను వేలాది సంవత్సరాలుగా పండిస్తున్నారు. మీరు షాక్ అవ్వొచ్చుకానీ.. దీన్ని అక్కడి వారు ఎక్కువగా పశువుల దాణాగా (Animal Feed ) వినియోగించేవారు. దాంతో పాటు గుర్రాలకు శక్తిని అందించేందుకు వీటిని తినిపించేవారు.
ఓట్స్ ( Oats ) మన దేశానికి చెందిన పంట కాదు. అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది. దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు ( Nutritional Values ) . పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం ( Easy To Digest ) అవుతాయి. కొవ్వును తగ్గించి ( Reduce Fat ) , ఇన్సులిన్ లెవల్‌ను కూడా పెంచుతుంది. ఇలా ఓట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ( Benefits of Oats ) ఇతర విశేషాలు మీకోసం. ఓట్స్ సంవత్సరం అంతా పండుతాయి. పైగా భారీ వర్షాపాతాన్ని కూడా తట్టుకోగలవు. యూరోప్, పశ్చిమాసియాలో ఓట్స్ను వేలాది సంవత్సరాలుగా పండిస్తున్నారు. మీరు షాక్ అవ్వొచ్చుకానీ.. దీన్ని అక్కడి వారు ఎక్కువగా పశువుల దాణాగా (Animal Feed ) వినియోగించేవారు. దాంతో పాటు గుర్రాలకు శక్తిని అందించేందుకు వీటిని తినిపించేవారు. Also Read : Harbhajan Singh Birthday: హర్భజన్ సింగ్.. హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్
అయితే 19 శతాబ్దంలో వీటి గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. దీని పోషక విలువల గురించి తెలుసుకున్న ప్రజలు ఓట్స్‌ను తమ ఆహరంలో భాగం చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రెడ్స్ ( Oat Breads) తయారీలో ఎక్కువగా వినియోగించేవారు.
Benefits Of Oats : ఓట్స్ వల్ల అనేక లాభాలు
శక్తిని ఇస్తుంది
ఓట్స్‌లో విటమిన్ బి ( Vitamine B ) సహజంగా లభిస్తుంది. కార్పోహైడేట్లు, ప్రోటీన్స్, ఖనిజాల ( Minerals ) శాతం కూడా అధికం. నరాల బలహీనతతో పాటు నిస్సత్తువను పారద్రోలుతుంది.
ఫ్యాట్ బర్నర్
బరువుతగ్గాలి అనుకునేవారికి ( Weight Loss ) ఓట్స్ బాగా ఉపయోగపడుతుంది. బెటా గ్లూకన్ ( Beta- Glucan ) అనే పీచు పదార్థం కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతోంది. ఓట్స్‌లో ఇది మెండుగా ఉంటుంది. బెటా గ్లూకన్ ఇన్ఫెక్షన్స్‌ను ( Beta- Glucan Infections ) కూడా దూరం చేస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read :PM Modi meets soldiers: జవాన్ల ధైర్య సాహసాలను మెచ్చుకున్న ప్రధాని మోదీ..
బీపీకి చెక్
ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ( Magnesium ) కేవలం 40 గ్రాముల ఓట్స్లో ఉంటుంది. మెగ్నీషియం వల్ల బీపీ ( Blood Pressure ) అదుపులో ఉంటుంది. రక్తనాళాలు కుచించుకు పోవడాన్ని అది ఆపుతుంది. దాంతో గుండెపోటు (Heart Attack ) ప్రమాదం కూడా తగ్గుతుంది. ఓట్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే మధుమేహం ( Diabetes ) కూడా అదుపులో ఉంటుంది.
ప్రొటీన్ అధికం
ప్రొటీన్ ( Protein ) శరీర నిర్మాణానికి తోడ్పడుతుంది. ఇది గోధుమలు (Wheats ) , బార్లీ ( Barley ) వంటి చిరుధాన్యాల్లో అధికంగా లభిస్తుంది. అయితే వీటిని తీసుకోవడం ఇష్టం లేని వారు ఓట్స్‌ను తీసుకోవచ్చు. ఇందులో ఉండే గ్లూటెన్ ( Gluten ) వల్ల శరీరానికి ఎలాంటి హానికలగదు అని తేలింది.
Also Read : సమంత, నాగచైతన్య జోడీగా 'థ్యాంక్ యూ'
ఓట్స్ వల్ల అనేక లాభాలు
ఆస్తమా నుంచి క్యాన్సర్ ( Cancer ) వరకు పలు అనారోగ్యాలకు ఓట్స్‌తో చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఓట్స్ ఒక ఔషధంలా పని చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న ఓట్స్‌ను మీ జీవితంలో ఒగ భాగం చేసుకొని చక్కని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..